ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి song lyrics penned by సిరివెన్నెల సీతారామ శాస్త్రి, music composed by ఎస్. ఏ. రాజ్ కుమార్, and sung by ఎస్.పి.బాలు from the movie సుస్వాగతం (1998).
Song | ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి |
Singer | ఎస్.పి.బాలు |
Music | ఎస్. ఏ. రాజ్ కుమార్ |
Lyricst | సిరివెన్నెల సీతారామ శాస్త్రి |
Movie | సుస్వాగతం (1998) |
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి Song lyrics
శ్రీ శ్రీనివాసం శివపారిజాతం
శ్రీ వెంకటేశం మనసాస్మరామి
శ్రీ శ్రీనివాసం శివపారిజాతం
శ్రీ వెంకటేశం మనసాస్మరామి
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
ఏ స్వప్నలోకల… సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
తళతళ తారకా… ఆఆ, మెలికల మేనకా
మనసున చేరెగా… ఆఆ, కలగల కానుకా
కొత్తగా కోరికా చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల… సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ… ప్రేమనేది పుట్టగా
తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ… ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటె… విన్నాను ఇన్నాళ్ళు
నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో, ఆ నవ్వులో… మహిమ ఏమిటో
ఆ కాంతిలో ఈనాడేనా… ఉదయమైనదో
మహిసీమలో ఇన్ని… మరుమల్లె గంధాలు
మునుపెన్నడు లేని… మృదువైన గానాలు
మొదటి వలపు… కథలు తెలుపు
గేయమై తియ్యగా… స్వరములు పాడగా
ఏ స్వప్నలోకాల… సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
మహరాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంటనియ్యకా
మహరాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంటనియ్యకా
నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట
పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం… ఆమె నెమ్మదీ
అందుకే అంకితం… అయినదీ మదీ
సుకుమారమే ఆమె… చెలిగత్తె కాబోలు
సుగుణాలకే ఆమె… తలకట్టు కాబోలు
చెలియ చలువ… చెలిమి కొరకు
ఆయువే ఆశగా… తపమును చేయగా
ఏ స్వప్నలోకాల… సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
తళతళ తారకా… మెలికల మేనకా
మనసున చేరెగా… కలగల కానుకా
కొత్తగా కోరికా… చిగురులు వేయగా
ఏ స్వప్నలోకల… సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
Watch ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి Song Video
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి song is from this సుస్వాగతం (1998) movie.
ఎస్.పి.బాలు is the singer of this ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి song.
This ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి Song lyrics is penned by సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
Post a Comment